Foods : తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు అంటారు. మన దగ్గర ఉన్న డబ్బును దోచుకోవచ్చేమో కానీ తెలివి తేటలను ఎవరూ దోచుకోలేరు. కొన్ని పదార్థాలను తింటే తెలివి పెరుగుతుంది అంటారు. తెలివి తేటలను పెంచే పదార్థాలే కాదు తెలివితేటలను హరించే పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు ఆలోచన సామార్థ్యాన్ని క్రమేపి కోల్పోతుంది. మెదడు మీద తెలివి తేటల మీద అమితమైన ప్రభావాన్ని చూపించే ఈ ఆహారపదార్థాలను సాధ్యమైనంత మేరకు తీసుకోకపోవడమే ఉత్తమం. తెలివి తేటలను తగ్గించే పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తీపి పదార్థాలు.. చక్కెరతో చేసే తీపి పదార్థాలను, తీపి వంటకాలను తీసుకోవడం తగ్గించాలి. ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
తీపి పదార్థాలు మెడదు పనితీరును నెమ్మదింపచేస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు చక్కెరకు దూరంగా ఉండాలి. అలాగే ఉప్పు లేనిదే ఏ ఆహార పదార్థమైన రుచి పచి ఉండదు. ఉప్పు లేని వంటకాలను ఊహించలేము. మనం తినే ఆహారంలో ఉప్పు కూడా భాగమైపోయింది. కానీ అమితమైన ఉప్పు ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఆహారపదార్థాల్లో ఎక్కువగా ఉప్పు తీసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. మెడదు మీద కూడ ఉప్పు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆలోచనా సామర్థ్యాన్ని ఉప్పు దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పిన ఎవరూ పట్టించుకోరు.
మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికి తెలుసు. కేవలం ఆరోగ్యమే కాకుండా మద్యపానం వల్ల మెదడు కూడా దెబ్బతింటుదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు మద్యపానం వల్ల ఆలోచనల్లో చురకుదనం పోతుందట. కాబట్టి మద్యం అలవాటును మానేస్తే మంచిది లేదంటే తగ్గించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. మనకు ఉన్న తెలివిని పెంచుకోకపోయిన పర్వాలేదు కానీ ఉన్న తెలివిని పోగొట్టుకోకూడదు. పిల్లలకు తీపి పదార్థాలు, ఉప్పును తగ్గించి పెట్టాలి. పెద్దలు కూడా ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలి.