స్టైల్‌గా ఉండాలని, స్టైలిష్‌గా కనిపించాలని నేటి తరుణంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక యువత విషయానికి వస్తే అది మనకు రెట్టింపు పాళ్లలో కనిపిస్తుంది. ప్రధానంగా యువతులు, మహిళలైతే ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండ్స్‌ను గమనిస్తూ అందుకు తగినట్టుగా పలు రకాల మోడ్రన్ వస్త్రాలు ధరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అంత వరకు బాగానే ఉన్నా, వారు ధరించే మోడ్రన్ దుస్తుల్లో ఓ రకమైన గార్మెంట్స్ వల్ల వారికి పలు అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఆ గార్మెంట్ ఏంటంటారా? అదేనండీ, బ్రా. అవును, అదే. దాంతో మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయట.
యువతులు, మహిళలైతే బ్రాలను ఎక్కువగా ధరించడం పరిపాటే. స్టైల్ కోసం, ఫ్యాషన్‌గా ఉండాలనో వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల కలిగే అనారోగ్యాలను మాత్రం గుర్తించడం లేదు. సాధారణంగా బ్రాలను ధరిస్తే వక్షోజాలు మంచి ఆకృతిలో ఉంటాయని అనేక మంది భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదట. బ్రాలను ధరించడం వల్ల వక్షోజాలు సాగిపోతాయట. అదెలాగంటే బ్రాలు వక్షోజాలను ఎల్లప్పుడూ గట్టిగా బిగుతుగా పట్టి ఉంచుతాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త సరఫరా తగ్గిపోతుంది. ఈ క్రమంలో వాటికి ఊపిరాడనట్టయి క్రమంగా అవి సరైన ఆకారాన్ని కోల్పోతాయి. అదీ అసలు మ్యాటర్. కాబట్టి మహిళలు బ్రాలను ధరించకపోవడమే ఉత్తమం.
అయితే బ్రాలను ధరించకుండా ఉండడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయట. అవేమిటంటే… బ్రాలను ధరించకపోతే వక్షోజాలకు రక్తం బాగా అంది శక్తి స్థాయిలు పెరుగుతాయట. దీంతో వక్షోజాలు మంచి ఆకారానికి కూడా వస్తాయట. అదేవిధంగా నిద్రబాగా పడుతుందట. ఇతర అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి శారీరక ఆరోగ్యం చేకూరుతుందట. వక్షోజాల సౌందర్యం పెరుగుతుందట. మనస్సుకు బాగా ప్రశాంతత కలుగుతుందట. తెలుసుకున్నారుగా! బ్రాలను వాడకపోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి! నచ్చితే షేర్ చేయండి!