Incense Sticks : హిందూ సంప్రదాయంలో దేవుళ్లను పూజించేందుకు భక్తులు భిన్నమైన మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే ఎవరు ఎలా పూజలు చేసినా కచ్చితంగా అగర్‌బత్తీలను మాత్రం వెలిగిస్తారు. అగర్ బత్తీలు మనకు రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అగర్‌బత్తీలు మనకు మేలే చేస్తాయి. ఆధ్యాత్మిక పరంగానే కాదు.. ఆరోగ్యపరంగా కూడా అగర్‌బత్తీలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అగర్ బత్తీలను వెలిగించడం వల్ల మనం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. వీటిని వెలిగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అగర్‌బత్తీలు చక్కని సువాసనను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని వెలిగిస్తే గది మొత్తం సువాసన భరితమవుతుంది. అరోమా థెరపీ ప్రకారం చక్కని వాసనలను పీల్చడం వల్ల పలు వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. కనుక అగర్ బత్తీలను వెలిగించి వాటి వాసన చూస్తే అరోమాథెరపీ జరుగుతుంది. దీంతో పలు వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా అగర్ బత్తీల నుంచి వచ్చే సువాసన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా అనిపిస్తుంది. దీంతో చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర సరిగ్గా పట్టని వారు రాత్రి పూట అగర్ బత్తీలను వెలిగించి కాసేపు ఉంటే చక్కగా నిద్రపడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
వీటిని వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్న గాలి శుభ్రంగా మారుతుంది. గాలిలో ఉండే కాలుష్య కారకాలు నాశనం అవుతాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. మూడ్ మారుతుంది. ఒత్తిడి నుంచి బయట పడతారు. అగర్ బత్తీలను వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి చేసే పనిపై ధ్యాస పెరుగుతుంది. దీంతోపాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగు పడతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇది దోషాలను నివారిస్తుంది. మనల్ని సమస్యల నుంచి బయట పడేస్తుంది.
యోగా లేదా వ్యాయామం చేసేవారు పక్కన అగర్‌బత్తీలను వెలిగిస్తే మనస్సు ప్రశాంతంగా మారి చేసే పనిపై మరింత దృష్టి పెడతారు. దీంతో మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే అగర్‌బత్తీల నుంచి వచ్చే వాసనను పీల్చడం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి. దీంతో పలు రకాల వ్యాధులు నయం అవుతాయి. అయితే అగర్‌బత్తీలు సహజసిద్ధంగా తయారు చేసినవి అయి ఉండాలి. కృత్రిమంగా, రసాయనాలతో తయారు చేసిన వాటిని వాడవద్దు. సహజసిద్ధమైనవి అయితేనే పైన తెలిపిన ప్రయోజనాలు పొందవచ్చు.