Vastu Tips : ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. కొందరు ఎంత సంపాదించిన ఖర్చైపోతూ ఉంటుంది. రాత్రి పగళ్లు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో ఒక ఖర్చు వచ్చి మాయమైపోతుంది. సంపాదించిన డబ్బులు సరిపోక అప్పులవుతాయి. ఇలా డబ్బు నిలబడకపోవడానికి, అప్పులు అవడానికి మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా కారణమవుతాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బును అందరూ సంపాదిస్తారు కానీ దానిని నిలుపుకునే వారు కొందరే. ఈ సమస్యకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, దుబారా వంటి వాటితో పాటు దుబారా కూడా కారణమనే చెప్పాలి.
ఇంట్లో ఉంచిన వస్తువులను వాస్తుకు అనుగుణంగా ఆయా దిశల్లో ఉంచాలని వారు సూచిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా సంపద దేవుడైన కుబేరున్ని సంపన్నం చేసుకోవాలి. ఆయన మన్నించినప్పుడు అదృష్టం, సంపద భక్తులపై కురుస్తాయి. ఉత్తరం కుబేర స్థానం అంటారు. ఉత్తరం కుబేరునికి మంచి ప్రదేశం. సంపద పెరుగుతుంది. కాబట్టి ఉత్తరం దిక్కును శుభ్రంగా, ఎనర్జిటిక్ గా, పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. ఇది సంపద పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈశాన్య మూలన గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎటువంటి అడ్డంకులు ఉంచకూడదు. చెత్త, చెదారాలను కూడా ఉంచకూడదు. ఈశాన్య దిశ సిరిసంపదలకు అనుకూలిస్తుంది.
అదే విధంగా ఇంటిని ఎల్లప్పుడూ శుబ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పనికిరాని వస్తువులను, చెత్తా చెదారాలను పారేస్తూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లతో కూడిన పోల్స్ లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బరువులు లేకుండా చూసుకోవాలి. నీటి ట్యాంకులు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం పోతుంది. ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది. డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.