Budimi Kaya : గ్రామాల్లో, రోడ్ల పక్కన, బీడు భూముల్లో, పొలాల గట్ల మీద మనకు కనిపించే మొక్కల్లో బుడిమి కాయ మొక్క ఒకటి. దీనిని బుడ్డకాయ మొక్క, కుప్పంటి మొక్క అనే పేర్లతో కూడా పిలుస్తారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఈ మొక్క చూడడానికి ముదురు ఆకులతో, చిన్న చిన్న కాయలతో రెండున్నర అడుగులు పెరుగుతుంది. గ్రామాల్లో ఈ మొక్క కాయలను ఆహారంగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తారు. పండిన బుడిమి కాయలు టమాట రుచిని కలిగి ఉంటాయి. చాలా మంది దీనిని పిచ్చి మొక్కగా భావిస్తారు. కానీ ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో బుడిమి కాయ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తారని మనలో చాలా మందికి తెలియదు.
ఈ కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో, ఆర్థ రైటిస్ నొప్పులను నయం చేయడంలో ఈ బుడిమి కాయలు ఎంతగానో సహాయపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల ఊబకాయం సమస్య నుండి బయటపడవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో వ్యర్థ పదార్థాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది.
మూత్రపిండాల సంబంధిత సమస్యలు తగ్గి వాటి పనితీరు మెరుగుపడుతుంది. బుడిమి కాయలను తినడం వల్ల శరీరంలో రోన నిరోధక శక్తి పెరిగి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రతిరోజూ ఈ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి కూడా ఈకాయలకు ఉంది. కంటికి సంబంధించిన సమస్యలను నయం చేయడానికి కూడా బుడిమి పండ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఈ పండ్లల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లకు అలాగే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు బుడిమి కాయలను తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ పండ్లు మనకు సహాయపడతాయని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఈ కాయలను పచ్చిగా తినకూడదు. పూర్తిగా పండిన తరువాత మాత్రమే తినాలి. కొందరికి వీటిని తింటే అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకపోవడమే మంచిది. పిచ్చి మొక్కగా భావించే బుడిమి కాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కాయలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.