Annam : అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న విషయం మనందరికి తెలిసిందే. హిందూ సాంప్రదాయంలో అన్నాన్నికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏది లోపించిన మనం బ్రతకగలం. కానీ ఆహార లోపం కలిగితే మాత్రం మనం బ్రతకడం కష్టం. అన్నం దొరకక ఆకలితో మరణించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. దానాలల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. అన్న దానాన్ని మించిన దానం మరొకటి లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన ఎంత ఇచ్చిన ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్న వారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు.
మానవుడికి ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ఎంతో ముఖ్యమైనది. బ్రహ్మ దేవున్ని సృష్టిలో దేవతలకు అమృతాన్ని, మానవులకు మరియు ఋషులకు అన్నాన్ని, పిశాచాలకు మద్యాన్ని, మాంసాన్ని ఆహారంగా సృష్టించాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కరించి తీసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ఆహారాన్ని తీసుకోవాలి. ఎంగిలి ఎవ్వరికి పెట్టకూడదు. అలాగే అమితమైన భోజనం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పులు, బూట్లు వేసుకుని ఆహారాన్ని భుజించకూడదు. మంచంపై కూర్చొని, ఒడిలో పెట్టుకుని తినరాదు. దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు.
తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. అన్నదానం చేయడం వల్ల నిత్య జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలను మనం తట్టుకుని నిలబడతాం. కొందరు ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడుతుంటారు. ఎంత ప్రయత్నించిన సరైన రాబడి లేకపోవడం, విపరీతమైన ఖర్చులతో సతమతమైపోతుంటారు. అలాంటి వారు అన్నంలో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం ఇస్తే కనుక ఆదాయం పొందడంతో పాటు ధనవంతులు అవుతారని శాస్త్రం చెబుతుంది. అలాగే రాత్రివేళ ఇంట్లో కొద్దిగా అన్నాన్ని మిగల్చాలి. కొంచెం అన్నం కూడా మిగలకుండా శూన్య గృహాన్ని మిగల్చకూడదు. ఎందుకంటే ఇంటికి వచ్చే అతిధి, చెప్పకుండా వచ్చే వ్యక్తి , పితృస్వరూపమో, ఇంకేదైనా మనల్ని ఆశ్రయించి వచ్చే జీవ జంతుల వంటివి ఇంట్లో అన్నం లేకుంటే నిరాశ చెందుతాయి.
రాత్రివేళ మనం భోజనం చేసిన తరువాత కొద్దిగా అయిన అన్నాన్ని మిగల్చాలి. ఉదయం లేవగానే ఈ అన్నాన్ని వీధులో జంతువులకు, క్రిమికీటకాలకు ఆహారంగా వేయాలని శాస్త్రం చెబుతుంది. ఎవరైనా అన్నం మిగిల్చకుండా ఉంటే ఆ ఇంట్లో మనశాంతి లోపిస్తుంది. కాబట్టి అన్నంతో ఈ విధంగా చేయడం వల్ల మనశాంతిగా, ఆయురారోగ్యాలతో జీవించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. రోజూ రాత్రి ఒక గుప్పెడు అన్నాన్ని పక్కకు తీసి ఉంచాలి. ఉదయాన్నే ఆ అన్నాన్ని పక్షులకు, క్రిమికీటకాలకు, జంతువులకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పాపకర్మాలను పోగొట్టుకునే అవకాశం లభిస్తుంది.