Raisins Benefits : మనం ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఇంట్లో తయారు చేసుకున్న ఈ డ్రింక్ ను తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ డ్రింక్ ను తాగడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. నీరసం, రక్తహీనత సమస్యలతో బాధపడే వారు ఈ డ్రింక్ ను తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈ డ్రింక్ ను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఈ డ్రింక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావల్సినవి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు మరియు గుప్పెడు ఎండు ద్రాక్ష. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కళాయిలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఎండు ద్రాక్షను వేసి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. అలాగే ఉడికించిన ఈ ఎండు ద్రాక్షను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. ఈ విధంగా ఎండుద్రాక్షతో డ్రింక్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పొటాషియం, కాపర్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ బి6, థయామిన్, రైబో ప్లేవిన్ వంటి పోషకాలన్నీ అందుతాయి.
అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండుద్రాక్షతో తయారు చేసిన ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఎండు ద్రాక్షను తింటూ ఈ నీటిని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఈ డ్రింక్ ను ఇవ్వవచ్చు. వారికి 8 లేదా 10 ఎండు ద్రాక్షను వేసి తయారు చేసి ఈ పానీయాన్ని ఇవ్వవచ్చు. ఈ విధంగా ఎండు ద్రాక్షతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.