Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Papaya : బొప్పాయి పండ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివే..!

D by D
December 10, 2022
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Papaya : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా పండ్ల‌ను ఆహారంగా తీసుకోమ‌ని మ‌న‌కి సూచిస్తూ ఉంటారు. పండ్ల‌ల్లో మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న‌కు విరివిరిగా అందుబాటులో త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి, సౌంద‌ర్యానికి బొప్పాయి పండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండ్లను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండు మ‌నకు సంవ‌త్స‌ర‌మంతా ల‌భిస్తూ ఉంటుంది.

మ‌న దేశంలో ఈ పండును విరివిరిగా సాగూ చేస్తూ ఉంటారు. డెంగ్యూ జ్వ‌రం నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి వైద్యులు కూడా బొప్పాయిని తీసుకోమ‌ని సూచించ‌డంతో బొప్పాయి పండుకు ఎంతో గిరాకీ పెరిగింది. ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. బొప్పాయి పండులో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె ల‌తో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఐర‌న్, మాంగ‌నీస్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్ తో పాటు ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. బొప్పాయిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. దీనిలో క్యాల‌రీలు కూడా త‌క్కువగా ఉంటాయి. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌లు సాఫీగా సాగేలా చేయ‌డంలో కూడా బొప్పాయి పండు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

if you are eating Papaya you should know these facts
Papaya

రోజుకు ఒక బొప్పాయి ముక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక భోజ‌నం త‌రువాత దీనిని తీసుకుంటే జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయిలో ప‌పైన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి యాంటీఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. కీళ్‌ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల నొప్పులు, వాపులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ న‌శించి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా బొప్పాయి పండు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాదు మ‌న అందాన్ని కాపాడ‌డంలో కూడా బొప్పాయి పండు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో అధికంగా ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మం పై ముడ‌త‌లు రాకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. బొప్పాయి పండును గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖం పై మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి ముఖం మృదువుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. బొప్పాయి పండు మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా త‌లెత్తుతాయి. రోజు ఒక పెద్ద ముక్క కంటే ఎక్కువ‌గా ఈ బొప్పాయిని తీసుకోకూడ‌దు. బొప్పాయిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

గ‌ర్భిణీ స్త్రీలు బొప్పాయి పండును అస్స‌లు తీసుకోకూడ‌దు. దీనిలో పెపిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీని కార‌ణంగా గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే బొప్పాయి పండును కోసేట‌ప్పుడు వ‌చ్చే పాలు కొంద‌రిలో దుర‌ద‌ను క‌లిగిస్తాయి. అలాదే కొంద‌రిలో ఈ పండు దుర‌ద‌ను కూడా కలిగిస్తుంది. దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, కెరెటెమియా అనే వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే బొప్పాయి ఆకు రసాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంద‌న్ని విష‌యం మ‌న‌కు తెలిసిందే.

అయితే ఈ ఆకుల ర‌సాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల వాంతులు, విరేచ‌నాలు అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే అధికంగా జ్వ‌రం ఉన్న‌ప్పుడు కూడా బొప్పాయి పండును ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. పురుషులు ఎక్కువ‌గా బొప్పాయి పండును తీసుకోకూడదు. దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంది. షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు కూడా ఈ పండును ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు.

Tags: papaya
Previous Post

Pudina Pachadi : పుదీనాతో ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Next Post

Besan Peda : శ‌న‌గ‌పిండితో చేసే బేస‌న్ పేడా.. ఎంతో తియ్య‌గా ఉంటుంది.. ఒక్క‌సారి రుచి చూడండి..

Related Posts

హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
ఆధ్యాత్మికం

కుంకుమ లేదా బొట్టును నుదుట‌నే ఎందుకు పెట్టుకుంటారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే పదం ఎందుకు ఉంటుంది..?

July 12, 2025
lifestyle

పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

July 12, 2025
వైద్య విజ్ఞానం

బొల్లి వ్యాధి వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

July 12, 2025
హెల్త్ టిప్స్

వీటిని రోజూ తీసుకోండి.. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.