Dark Inner Thighs : మనలో చాలా మందికి చంక, తొడ, మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో చర్మం నల్లగా ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం, ఆయా భాగాల్లో చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, చర్మం పొడి బారడం, చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం వంటి కారణాల చేత ఆయా భాగాల్లో చర్మం నల్లగా మారతుంది. ఇలా చర్మం నల్లగా మారడం వల్ల ఎటువంటి సమస్య లేకపోయినప్పటికి అందవికారంగా కనబడడంతో నచ్చిన బట్టలు వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులుభంగా చంకలు, తొడలు, మోచేతులు వంటి భాగాల్లో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. నలుపును పోగొట్టి చర్మాన్ని తెల్లగా మార్చే ఈ ఇంటి చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా వాడాలి.. అన్న తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చేసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపును, అర చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మం నల్లగా ఉండే భాగాల్లో చేత్తో లేదా బ్రష్ తో రాసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మృత కణాలు తొలగిపోతాయి. చర్మానికి తగినంత తేమ లభించి చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల నల్లగా ఉండే చర్మం తిరిగి సాధారణ రంగుకు చేరుకుంటుంది. అలాగే చర్మం పై నలుపును తొలగించడంలో కలబంద గుజ్జు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కలబందతో ఎటువంటి పదార్థాలను కలపకుండా కేవలం కలబంద గుజ్జును ఉపయోగించి చర్మం ఉండే నలుపును తొలగించుకోవచ్చు.
ఇంట్లో సహజ సిద్దంగా ఉండే కలబంద గుజ్జును సేకరించి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ కు కొద్దిగా పసుపును కలిపి చర్మం పై నల్లగా ఉండే భాగాల్లో చేత్తో లేదా బ్రష్ తో రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆరే వరకు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కలబంద గుజ్జును ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి ఎటువంటి శ్రమ, ఖర్చు లేకుండా చంక, తొడలు, మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో నల్లగా ఉన్న చర్మాన్ని సాధారణ రంగు వచ్చేలా చేసుకోవచ్చు.