Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Dry Kiwi : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. రోజూ తినండి.. ఎందుకంటే..?

D by D
January 27, 2023
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dry Kiwi : మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో కివి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా దొరుకుతున్నాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. కివి పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కివి పండ్ల‌ను పూట‌కు రెండు చొప్పున రెండు పూట‌లా తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు క‌ణాల్లో కొవ్వును పేరుకుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో కివి పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని థైవాన్ దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

కివి పండ్లల్లో విట‌మిన్ సి, విట‌మిన్ ఇ లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేస్తాయి. మ‌నం ఆహారం అధికంగా తీసుకున్న‌ప్పుడు అది కొవ్వుగా మారి కొవ్వు క‌ణాల్లో చేరుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు క‌ణాల్లో మార్పును తీసుకు వ‌చ్చి క‌ణాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో ర‌క్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్ స్థాయిలు త‌గ్గుతున్నాయి. వీటిని రోజుకు నాలుగు చొప్పున 7 నుండి 8 వారాల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Dry Kiwi benefits in telugu take daily two of them
Dry Kiwi

గుండె జ‌బ్బులు, హైబీపీ ఉన్న వారు అలాగే ర‌క్త సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే ఈ కివీ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో కూడా కివి పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కివి పండ్లు చ‌క్క‌టి ఆమార‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆస్థ‌మా వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ కివి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

అలాగే మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా కివి పండ్లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ పండ్లు మ‌న‌కు తాజాగా ల‌భ్య‌మ‌వ‌డంతో పాటు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా ల‌భ్య‌మ‌వుతాయి. తాజా పండ్లు దొర‌క‌న‌ప్పుడు డ్రై ఫ్రూట్ రూపంలో ఉన్న కివి పండ్ల‌ను తీసుకున్నా కూడా మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా కివి పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Tags: Dry Kiwi
Previous Post

Bread Pudding : బ్రెడ్‌తో చేసే ఈ స్వీట్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Next Post

Gutti Vankaya Biryani : గుత్తి వంకాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీని ఇలా చేసుకోవ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.