Coconut Water : కొబ్బరి నీళ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన నీళ్లు. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లను కొన్ని సందర్భాల్లో ఫిల్టర్ చేసి సెలైన్‌కు బదులుగా కూడా ఉపయోగించవచ్చని డాక్టర్లు సైతం చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులను నయం చేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించేస్తాయి. విరేచనాలను అరికడతాయి. కనుక కొబ్బరి నీళ్లను తరచూ తాగాలి. అయితే కొందరు కొబ్బరి నీళ్లను మోతాదుకు మించి తాగుతుంటారు. వాస్తవానికి ఇలా తాగడం మంచిది కాదు. కొబ్బరి నీళ్లు మంచివే అయినా.. మోతాదుకు మించితే మాత్రం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను అధికంగా తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మనకు పొటాషియం లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. అయితే కొబ్బరి నీళ్లను అధికంగా తాగితే పొటాషియం స్థాయిలు మన శరీరంలో పెరిగిపోతాయి. దీంతో బీపీ మరింత తగ్గుతుంది. ఇది లో బీపీకి దారి తీస్తుంది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక కొబ్బరి నీళ్లను అతిగా తాగరాదు. అలాగే ఈ నీళ్లను అధికంగా తాగడం వల్ల విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటిని మోతాదులో తాగితే విరేచనాలను అరికట్టవచ్చు. కానీ మోతాదు మించితే విరేచనాలు అవుతాయి. కనుక కొబ్బరి నీళ్లను మోతాదులోనే తాగాలి.
కొబ్బరినీళ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా ఎక్కువే. అందువల్ల వీటిని తాగితే రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే మోతాదులో తాగితే ఏమీ కాదు. కానీ అధికంగా తాగితే షుగర్ పెరిగిపోతుంది. కనుక కొబ్బరినీళ్లను తక్కువగా తాగాలి. షుగర్ ఉన్నా లేకున్నా ఇలా ఎక్కువగా తాగడం మంచిది కాదు. కనుక ఈ నీళ్లను తక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక కొబ్బరి నీళ్లను అధికంగా తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు అదుపు తప్పుతాయి. దీంతో పొటాషియం, సోడియం, మాంగనీస్ స్థాయిలు అసమతుల్యం అవుతాయి. ఫలితంగా తల తిరగడం, వికారం, పక్షవాతం కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక కొబ్బరి నీళ్లను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.