Rose Apple Juice : వేసవి కాలం రానే వస్తుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే చాలు ఎక్కడలేని నీరసం, నిస్సత్తువ మన దరి చేరతాయి. వడదెబ్బ బారిన పడుతూ ఉంటారు. చాలా మంది ఎండవేడి నుండి బయటపడడానికి ఎనర్జీ డ్రింక్ లను, రసాయనాలు కలిగిన శీతల పానీయాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలిగినప్పటికి అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శీతల పానీయాలను తాగడం వల్ల అధిక బరువు బారిన పడాల్సి వస్తుంది. అలాగే దంతాలు దెబ్బతింటాయి. ఎముకలకు సంబంధించిన ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా ఈ పానీయాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కెఫిన్, రిఫైండ్ చేసిన పంచదారలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక వీటికి వీలైనంత దూరంగా ఉండడం చాలా అవసరం. మన ఇంట్లోనే ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనాన్ని పొందడంతో పాటు తక్షణ శక్తిని పొందవచ్చు. అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలే తప్ప ఎటువంటి హాని కలగదు.
మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం కలబంద గుజ్జును, తేనెను, నిమ్మరసాన్ని, అల్లం ముక్కలను, రోజ్ యాపిల్ లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో ఒక పెద్ద ముక్క కలబంద గుజ్జును తీసుకుని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో ఆరు రోజ్ యాపిల్ లను కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తగినన్ని చల్లటి నీళ్లను పోసుకుని కలపాలి. తరువాత రుచికి తగినంత తేనె, నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎనర్జీ డ్రింక్ తయారవుతుంది. వేసవికాలంలో బయట తిరిగి వచ్చిన తరువాత ఇలా డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. మార్కెట్ లో దొరికే శీతల పానీయాలను తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ఈ ఎనర్జిటిక్ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం మంచిది.