Aloo Manchuria : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆలూ మంచురియా కూడా ఒకటి. ఆలూ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఆలూ మంచురియాను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ ఆలూ మంచురియాను మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. సులువుగా, రుచిగా ఆలూ మంచురియాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – 3 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మంచురియా బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 5 ( మధ్యస్థంగా ఉన్నవి), కార్న్ ఫ్లోర్ – 4 టీ స్పూన్స్, మైదాపిండి – 4 టీ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ మంచురియా తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి వాటిని తురుముకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప తురుములో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వాటిని తగిన పరిమాణంలో మంచురియా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప బాల్స్ ను వేసి వేయించుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.
వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత సోయాసాస్, వెనిగర్, టమాట కిచప్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కార్న్ ఫ్లోర్ మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప బాల్స్ ను వేసి కలపాలి. సాసెస్ అన్ని పొటాటో బాల్స్ కు పట్టేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మంచురియా తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే రుచిగా ఇలా ఆలూ మంచురియానుతయారు చేసుకుని తినవచ్చు. ఈ మంచురియాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.