Thopa : మనం బియ్యంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యంతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యంతో చేసుకోదగిన తీపి వంటకాల్లో తోపా కూడా ఒకటి. ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. తోపా స్వీట్ ను తయారు చేయడం చాలా తేలిక. ఎవరైపా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే తోపా స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోపా స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 4 గ్లాసులు, 4 గంటల పాటు నానబెట్టిన బియ్యం – ఒక గ్లాస్, బెల్లం తురుము – ఒక గ్లాస్, కొబ్బరి తురుము – ఒక గ్లాస్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
తోపా స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టుకున్న బియ్యం, పచ్చి కొబ్బరి తురుము వేసి పలుచగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై ఉండలు లేకుండా కలుపుకోవాలి. బియ్యం మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బెల్లం తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి.
బెల్లం కరిగే వరకు తిప్పిన తరువాత మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోపా స్వీట్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా లేదా చల్లారిన తరువాత ఎలా తన్ని కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ తోపా స్వీట్ ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.