Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Masala Chekkalu : బియ్యం పిండితో కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా మ‌సాలా చెక్క‌ల‌ను చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
March 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Masala Chekkalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంట‌కాల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా వీటిని ఇష్టంగా తింటారు. పండుగ‌ల‌కు అలాగే స్నాక్స్ గా తిన‌డానికి వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చెక్క‌ల‌ల్లో మ‌నం మ‌సాలాలు వేసి వీటిని మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. సాధార‌ణ చెక్క‌ల కంటే ఈ విధంగా చేసే మ‌సాలా చెక్క‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. మ‌సాలా చెక్క‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. గుల్ల‌గుల్ల‌గా రుచిగా ఉండేలా ఈ మ‌సాలా చెక్క‌ల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా చెక్క‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – ఒక క‌ప్పు, క‌చ్చా ప‌చ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి – ఒక టేబుల్ స్పూన్, 10 నిమిషాల పాటు నాన‌బెట్టిన‌ పెస‌ర‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, కారం – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన‌ పుదీనా – కొద్దిగా.

Masala Chekkalu recipe in telugu make in this method
Masala Chekkalu

మ‌సాలా చెక్క‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్త‌గా పాతీ పిండిలా క‌లుపుకోవాలి. పిండి మ‌రీ మెత్త‌గా ఉండ‌కుండా చూసుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత పూరీ ప్రెస్ మీద క‌వ‌ర్ ను ఉంచి దానికి నూనెను రాయాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పూరీ ప్రెస్ స‌హాయంతో చెక్క‌లా వ‌త్తుకుని కాట‌న్ వ‌స్త్రం మీద వేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక త‌గిన‌న్ని చెక్క‌ల‌ను వేసి వేయించాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై నురుగు అంతా పోయి చెక్క‌లు రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా చెక్క‌లు త‌యారవుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా మ‌సాలా చెక్క‌ల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Masala Chekkalu
Previous Post

Kondapindi Aaku : కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఔష‌ధం ఇది..!

Next Post

Ginger Lemon Butter Milk : శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించే జింజ‌ర్ లెమ‌న్ బ‌ట‌ర్ మిల్క్‌.. ఇలా చేయాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.