Cucumber For Weight Loss : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అధిక బరువు సమస్య అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. గుండె పోటు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ప్రధాన కారణం అధిక బరువేనని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు. కనుక ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువును తగ్గించే రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు.
వీటి వల్ల ఫలితం ఉండకపోగా అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే వీటిని ఉపయోగించడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గించే ఆ రెండు పదార్థాలు ఏమిటి.. వీటిని ఎలా ఉపయోగించాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గించడంలో కీరదోస మరియు అల్లం మనకు ఎంతగానో దోహదపడతాయి. అల్లం మరియు కీరదోస మనకు సులభంగా లభించేవే. అలాగే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి.
అల్లాన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. అలాగే కీరదోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా కీరదోస కూడా మనకు సహాయపడుతుంది. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ముందుగా కీరదోసపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.
తరువాత ఒకటిన్నర ఇంచుల అల్లం ముక్కను తీసుకుని శుభ్రం చేసి ముక్కులగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కొరకు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యాస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. పరగడుపున కుదరని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా సహజ సిద్దంగా బరువు తగ్గవచ్చు.