మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోసమే. మలబద్దకాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసకుందాం. ఆయుర్వేద ప్రకారం కొబ్బరినూనెలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. మలం గట్టిగా రాకుండా చేస్తుంది. కొబ్బరినూనెలో లిపిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
కొబ్బరినూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి పెద్ద పేగులోని కణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో శక్తి లభిస్తుంది. కణాలకు చెందిన మెటబాలిక్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ రేటును మెరుగు పరుస్తుంది. శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది.
కొబ్బరినూనె చిన్న పేగుల్లో లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. దీంతో పేగుల్లో కదలికలు బాగుంటాయి. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనె మెటబాలిజంను పెంచుతుంది. దీని ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం తగ్గుతుంది.
మలబద్దకాన్ని తగ్గించేందుకు వర్జిన్ కొకొనట్ ఆయిల్ మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంటే ఫిల్టర్ చేయబడని నూనె అన్నమాట. కోల్డ్ కంప్రెస్ విధానంలో తయారు చేయబడిన నూనె అని అర్థం. ఇది మనకు మార్కెట్ లో లభిస్తుంది. లేదా గానుగలో ఆడించిన నూనెను అయినా వాడవచ్చు. ఈ నూనెను తాజా కొబ్బరి నుంచి తయారు చేస్తారు. అందువల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. రోజూ రాత్రి పూట ఒకటి లేదా రెండు టీస్పూన్ల కొబ్బరినూనెను తాగడం వల్ల మరుసటి రోజు విరేచనం సులభంగా అవుతుంది. రాత్రి వీలు కాదని అనుకునే వారు ఉదయాన్నే పరగడుపునే అయినా ఈ నూనెను తీసుకోవచ్చు. దీంతో మలబద్దకం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు ఈ నూనెను వాడాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365