Yellow Vs White Yolk : కోడిగుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మనలో చాలా మంది ఎక్కువగా కోడిగుడ్డు తెల్ల సొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు పచ్చసొనలో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుదని దీనిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావడంతో పాటు బరువు కూడా పెరుగుతారని మనలో చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు.
అసలు ఇది ఎంత వరకు నిజం కోడిగుడ్డు పచ్చ సొనను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు పచ్చసొనలో 16 గ్రా. ప్రోటీన్, 54 శాతం విటమిన్ డి, 28 శాతం విటమిన్ ఎ ఉంటుంది. అంతేకాకుండా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే రైబో ప్లేవిన్, విటమిన్ బి 12 వంటి పోషకాలు కూడా ఉంటాయి. కోడిగుడ్డు పచ్చ సొనను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కోడిగుడ్డు తెల్లసొనతో పాటు పచ్చసొనను కూడా ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజూ 2 కోడిగుడ్డు పచ్చసొనలను తీసుకోవచ్చని అదే గుండె సమస్యలతో బాధపడే వారు ఒక పచ్చసొనని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డు తెల్లసొనతో పాటు పచ్చసొనను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.