Fruits For Stomach : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ కు తినడానికి అలవాటు పడిన మనలో చాలా మంది ఫైబర్ కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో పొట్ట పూర్తిగా శుభ్రపడడం లేదు. దీని కారణంగా మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా పూర్తి శరీర ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మనం కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
పొట్టలో మలినాలు పేరుకుపోకుండా ఉంటాయి. పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆ పండ్లు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఆపిల్ పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఆపిల్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ప్రీ బయాటిక్ గా పని చేస్తుంది. పొట్టలో ఉండే ప్రయోజకరమైన బ్యాక్టీరియా ద్వారా మాత్రమే ఈ పెక్టిన్ విచ్చిన్నమవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ అంతా మెరుగుపడుతుంది.
పొట్ట శుభ్రపడుతుంది. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల కూడా మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పప్పైన్ అనే పదార్థం జీర్ణవ్యవస్థ సాఫీగా సాగేలా చేయడంలో దోహదపడుతుంది. ఆహరాన్ని తీసుకోవడానికి ముందు బొప్పాయి పండును తినడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మలినాలు, విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. అదే విధంగా నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ సాఫీగా సాగేలా చేయడంలో దోహదపడుతుంది. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జామకాయలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.
దీనిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన 12 శాతం ఫైబర్ లభిస్తుంది. జామకాయను తినడం వల్ల ప్రేగుల కదలికలు పెరుగుతాయి. డయేరియా వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా స్ట్రాబెరీలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ప్రేగుల కదలికలను క్రమబద్దీకరించడంలో వీటిలో ఉండే ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపరచడంతో పాటు పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.