Bay Leaves Tea : కూరల్లో కరివేపాకును తీసేసినట్టు మనం బిర్యానీల్లో బిర్యానీ ఆకును కూడా తీసి పక్కకు పెడుతూ ఉంటాము. కానీ ఈ బిర్యానీ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల 100 రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి దాదాపు అందరి వంటగదిలో ఉంటాయి. మనం సాధారణంగా బిర్యానీ ఆకులను మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ బిర్యానీ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలను మన శరీరానికి చక్కగా అందాలంటే వీటితో టీ ని తయారు చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులో పోసుకుని గోరు వెచ్చగా తాగాలి.
ఇలా తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా బిర్యానీ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ టీ ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా బిర్యానీ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఈటీ ని తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు బిర్యానీ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఈ బిర్యానీ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల నెలసరి సమస్యలు చాలా సులభంగా దూరమవుతాయి. అలాగే శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను, వ్యర్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ బిర్యానీ ఆకులు మనకు సహాయపడతాయి. ఈ బిర్యానీ ఆకుల్లో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని వాడడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా బిర్యానీ ఆకులు మనకు ఎంతగానో సహాయపడతాయని వీటితో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.