ఎక్కువగా ఆ కాలంలో గ్రాఫిక్స్ , సాంకేతికత లేవు .. కాబట్టి ట్రిక్ ఫోటోగ్రఫీ, ఇంకా split technology సహాయంతో ప్రేక్షకులను బోల్తా కొట్టించేవారు.. split technology అంటే ఒకేసారి డబల్ రోల్ చూపించాల్సి వచ్చినప్పుడు వారిద్దరి మధ్యన ఒక గోడ లాంటిది చాలా పలుచగా కనపడకుండా ఉంటుంది.. విడి విడిగా ఒకే హీరో తో రెండు సార్లు షూట్ చేసి, ఆ గోడ తో merge చేసి, ఒకే సన్నివేశం అనే భ్రమ ని ప్రేక్షకులకి అందించడం.. వీరిలో రాముడెవరు ? భీముడెవరు ? దాదాపుగా ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ లో తప్ప ఎన్టీఆర్ పోషించిన రాముడు, భీముడు పాత్రలు ఒకేసారి ఎదురుపడవు.. మరి ఈ సీన్ లో ఇద్దరు ఎన్టీఆర్ లు ఎలా వచ్చారు? ఈ సీన్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథను మూవీ మొఘల్ గా పేరున్న దివంగత డి . రామానాయుడు ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు..
సినిమా మొత్తం రాముడు, భీముడు ఒకేసారి కనిపించరు, అయితే క్లైమాక్స్ లో రాముడు-భీముడు కలిసి సినిమాలలోని మిగతా పాత్రలను సరదాగా ఆటపట్టించే సన్నివేశం ఉంటుంది.. ఇక ఆ సన్నివేశంతో సినిమా పూర్తవుతుంది, రామానాయుడు సినిమా విడుదల తేదీ ని కూడా ప్రకటించేసారు.. అయితే అక్కడే వచ్చింది చిక్కు, ఎన్టీఆర్ కి కాల్ షీట్ల సమస్య వచ్చిపడింది.. ఆయన ఒప్పుకున్న మిగతా సినిమాల నేపథ్యంలో ఇలా split టెక్నాలజీ తో షూట్ చేసేటంత సమయం లేదు..రామానాయుడు అభ్యర్ధన మేరకు ఒక్క అర పూట కాల్ షీట్ ఇచ్చారుట ఎన్టీఆర్..
దానితో దాదాపుగా ఒడ్డు -పొడవు ఇంకా రూపంలో ఎన్టీఆర్ తో పోలినట్టుగా ఉండే మరో ప్రముఖ నటుడు సత్యనారాయణతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారట.. ఎన్టీఆర్ ప్రక్కనే సత్యనారాయణని పెట్టి, లాంగ్ షాట్ ఇంకా ఏవేవో జిమ్మిక్కులు చేసి, ఆ సన్నివేశాన్ని తీసారట.. అయితే చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది ఆ సీన్ లో ఉన్నది సత్యనారాయణ అని కనిపెట్టేసినా, సినిమా మాత్రం సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పుకొచ్చారు రామానాయుడు.