Copper Vessel Water : మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. మారుతున్న జీవన విధానం, పనుల కారణంగా చాలా మంది ఇలా టీ, కాఫీలను తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే ఇలా టీ, కాఫీలను తాగడం వల్ల మనకు ఎటువంటి మేలు జరగకపోగా శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. టీ, కాఫీలను తాగడానికి బదులుగా రోజూ ఉదయం నిద్రలేవగానే ఒకటిన్నర లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ముఖ్యగా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మరింత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. రోజూ రాత్రి రాగి పాత్రలో నీటిలో పోసి మూత పెట్టి ఉంచాలి.
ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మరింత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. వర్షాకాలంలో నీటిలో ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్ లు ఉండే అవకాశం ఉంటుంది. రాగి పాత్రలో నీటిని పోసి ఉంచడం వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు 95 శాతం వరకు నశిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల నీటి ద్వారా కలిగే జబ్బుల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఉదయం పూట ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
25 శాతం వరకు మనం జబ్బుల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా రోజూ ఉదయం పరగడుపున లీటర్నర నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. శరీరం శుభ్రపడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గి సుఖ విరోచనం జరుగుతుంది. ఇలా నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. అంతేకాకుండా ఉదయం పూట నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. రక్తంలోని పోషకాలు చర్మానికి, జుట్టుకు చక్కగా అందుతాయి.
చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఉదయం పూట నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇలా రోజూ ఉదయం పరగడుపున రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు వాతావరణం చల్లగా ఉందని నీటిని మానేస్తూ ఉంటారు. అయితే అలా చేయకూడదని వాతవరణం చల్లగా ఉన్నప్పుడు నీటిని గోరు వెచ్చగా చేసుకుని తాగాలని వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రత వద్ద నీటిని తాగాలని వారు చెబుతున్నారు. ఒకేసారి నీటిని తాగలేని వారు 5 నుండి 6 నిమిషాల వ్యవధితో నీటిని తాగాలని వారు సూచిస్తున్నారు.