Garlic Water : మనం వెల్లుల్లిని ఎంతో కాలంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాము. వెల్లుల్లి లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. దీనిని ఎక్కువగా పేస్ట్ గా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని నేరుగా తింటూ ఉంటారు. కొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అలాగే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. వర్షాకాలంలో ఈ నీటిని మనం తప్పకుండా తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి షుగర్ ను అదుపులో ఉంచడంలో వెల్లుల్లి నీరు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదే విధంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు, గుండె జబ్బులతో బాధపడే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే విధంగా వెల్లుల్లి నీటిని తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఈ నీరు చక్కగా పని చేస్తుంది. అదే విధంగా కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గి మనకు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను నలగొట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి నీరు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.