Potatoes For Cleaning : బంగాళాదుంపలను మనం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. బంగాళాదుంపలు ఉండని ఇళ్లు ఉండదనే చెప్పవచ్చు.వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. పిల్లల నుండి పెద్దల వరకు బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే బంగాళాదుంపలతో మనం మన చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇది మనందరికి తెలిసిందే. అలాగే బంగాళాదుంపలను ఉపయోగించి మనం బట్టలపై మరకలను తొలగించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు.
బంగాళాదుంపలను ఉపయోగించి మనం చేయదగిన ఇతర పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనలో చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి , కంటి సమస్యలను తొలగించుకోవడానికి కళ్లద్దాలను వాడుతూ ఉంటారు. కళ్లద్దాలను రోజూ వాడడం వల్ల వాటిపై మరకలు, దుమ్ము, ధూళి వంటివి రోజూ పేరుకుపోతూ ఉంటాయి.కనుక వీటిని మనం రోజూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కళ్లద్దాలను శుభ్రపరుచుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ బంగాళాదుంపలను ఉపయోగించి మనం చిటికెలో కళ్లద్దాలను శుభ్రం చేసుకోవచ్చు. బంగాళాదుంప స్లైస్ ను తీసుకుని లెన్స్ యొక్క లోపలి భాగం వైపు రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల మరకలు, దుమ్ము తొలగిపోయి లెన్స్ చక్కగా మెరుస్తుంది.
అలాగే బంగాళాదుంపలను ఉపయోగించి మనం ఇనుప వస్తువులకు పట్టిన తుప్పును కూడా తొలగించవచ్చు. దీని కోసం తుప్పు పట్టిన భాగంలో బేకింగ్ సోడా, డిష్ లిక్విడ్ ను వేసుకోవాలి. తరువాత బంగాళాదుంప ముక్కను తీసుకుని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల తుప్పు త్వరగా వదిలిపోతుంది. అలాగే అనుకోకుండా కొన్నిసార్లు మన కాళ్లల్లో లేదా చేతులల్లో చిన్న చిన్న గాజు ముక్కలు గుచ్చుకుపోతూ ఉంటాయి. ఇవి కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. అలాగే తీయడానికి వీలులేకుండా ఉంటాయి. అలాంటప్పుడు బంగాళాదుంప ముక్కను గాజు ముక్కలు గుచ్చుకున్న చోట ఉంచి కొద్దిగా గట్టిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల గాజు ముక్కలు సులభంగా బయటకు వస్తాయి. అలాగే వెండి వస్తువులను శుభ్రం చేయడంలో కూడా బంగాళాదుంప ముక్క మనకు సహాయపడుతుంది.
బంగాళాదుంపలను ఉడికించగా వచ్చిన నీటితో వెండి వస్తువులను శుభ్రం చేసుకోవడం వల్ల వెండి వస్తువులు తళతళ మెరిసిపోతాయి. అలాగే వేడి నీటిలో బంగాళాదుంపలను వేసుకోవాలి. అదే నీటిలో వెండి వస్తువులను వేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత వెండి వస్తువులను బయటకు తీసి పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులపై ఉండే మరకలు తొలగిపోతాయి. అలాగే బట్టలపై పడే చిన్న చిన్న మరకలను తొలగించడంలో కూడా బంగాళాదుంపలు దోహదపడతాయి. బంగాళాదుంపను స్టెయిన్ రిమూవర్ తో కలిపి బట్టలపై రుద్దడం వల్ల బట్టలపై పడిన మరకలు సులభంగా తొలగిపోతాయి.