మానవ శరీరంలో 75 శాతం వరకు నీరు ఉంటుంది. అందులో కేవలం 1 శాతం తగ్గినా చాలు మనకు దాహం అవుతుంది. ఇక మధుమేహం ఉన్నవారికి దాహం సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైనా సరే రోజూ తగినంత నీటిని తాగాలి. అప్పుడే మన శరీరంలో పలు జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. రోజూ తగినంత నీటిని తాగకపోతే మన శరీరం మనకు పలు సూచనలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా మనం నీటిని తక్కువగా తాగుతున్నామని అర్థం చేసుకోవాలి. దీంతో నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా సూచనలు కనిపించవు. మరి తక్కువ నీటిని తాగితే శరీరం ఏయే సూచనలను తెలియజేస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మీకు తరచూ తలనొప్పి వస్తుందా ? అయితే తగినంత నీటిని తాగకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. నీటిని సరిపోయినంత తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా వస్తున్న వారు నీటిని ఎక్కువగా తాగి చూడాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.
2. మలబద్దకం సమస్య ఉన్నా నీటిని తక్కువగా తాగుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు నీటిని ఎక్కువగా తాగి చూడాలి. దీంతో సమస్య పోతుంది.
3. శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం మారుతుంది. లోబీపీ వస్తుంది. ఈ సమస్య వస్తున్న వారు నీటిని తాగి చూడాలి.
4. తగినంత మోతాదులో నీటిని తాగకపోతే మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంది. కొందరికి మరీ పసుపుపచ్చగా కూడా మూత్రం వస్తుంది. ఇలా గనక లక్షణాలు కనిపిస్తుంటే నీటిని తగినంత తాగడం లేదని అర్థం చేసుకోవాలి. నీటిని సరైన మోతాదులో తాగాల్సి ఉంటుంది.
5. శరీరంలో నీటి శాతం తగ్గితే కండరాలు, ఇతర భాగాల్లో తిమ్మెర్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ లక్షణాలు ఉన్నవారు నీటిని తగినంత తాగి చూస్తే ఫలితం ఉంటుంది.
6. శరీరంలో నీరు తగ్గితే దాని ప్రభావం చర్మంపై పడుతుంది. దీంతో చర్మం సాగినట్లుగా, వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే నీటిని తాగాలి.
7. రోజూ తగినంత నీటిని తాగకపోతే కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ సమస్య సడెన్‌గా వచ్చిన వారు రోజూ తగినంత నీటిని తాగి చూడాలి. సమస్య తగ్గితే అది నీటిని తాగకపోవడం వల్లే వచ్చిందని తెలుసుకోవాలి. దీంతో రోజూ తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365