మన వంట ఇళ్లలో సహజంగానే ఎండు కొబ్బరి ఉంటుంది. దాన్ని తురుం పట్టి రకరకాల కూరల్లో వేస్తుంటారు. దీంతో కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇక కొబ్బరి తురుంను స్వీట్లలో కూడా వేస్తుంటారు. దాంతో స్వీట్లు చేస్తారు. అయితే ఎండు కొబ్బరిని అలా వాడుకోవచ్చు కానీ, నిజానికి పచ్చి కొబ్బరిని తింటేనే అధిక ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారికి పచ్చి కొబ్బరి ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
2. చర్మం, జుట్టు సమస్యలు ఉన్నవారు రోజూ పచ్చి కొబ్బరిని తింటుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. జుట్టు సమస్యలు పోతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
3. అధిక బరువు తగ్గేందుకు కూడా పచ్చికొబ్బరి సహాయ పడుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే బరువు కూడా తగ్గుతారు.
4. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. వయస్సు మీద పడడం వల్ల సహజంగానే ఎవరికైనా సరే మతిమరుపు సమస్య వస్తుంది. కానీ పచ్చి కొబ్బరిని తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీంతో మతి మరుపు సమస్య తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365