Turmeric Oil : మన ఆరోగ్యానికి, అందానికి పసుపు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పసుపును వాడడం వల్ల మనం చకకటి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంటల్లో అలాగే కొన్ని రకాల సౌందర్య చిట్కాలల్లో పసుపును వాడుతూ ఉంటాము. అయితే కేవలం పసుపే కాకుండా పసుపు నూనె కూడా మన సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. పసుపు నూనె మనలో చాలా మందికి తెలిసి ఉండదు. పసుపు నూనె అనగానే పసుపు నుండి నూనెను తీస్తారు అనుకుంటారు కాన ఈ నూనెను పసుపు మొక్క వేర్ల నుండి తయారు చేస్తారు. దీనిని వాడడం వల్ల మన చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక రకాల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు దూరమవుతాయి. పసుపు నూనెను వాడడం వల్ల మనకు కలిగే సౌందర్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు నూనెను వాడడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. చర్మంపై జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మంపై ఉండే జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేయడంలో పసుపు నూనె మనకు దోహదపడుతుంది. ఈ నూనెను వాడడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా కనబడేలా చేయడంలో కూడా పసుపు నూనె సహాయపడుతుంది. అలాగే ఈ నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మం వాపు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే దీనిలో ఉండే మైక్రోబయాల్ లక్షణాల కారణంగా చర్మంపై ఇన్పెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇక కొబ్బరి నూనెలో లేదా అముదంలో ఈ నూనెను కలిపి పాదాల పగుళ్లపైరాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు నివారించబడతాయి.
అంతేకాకుండా మన జుట్టు పెరుగుదలలో కూడా ఈ పసుపు నూనె ఉపయోగపడుతుంది. ఈ పసుపు నూనెను బాదంనూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంలో జుట్టు కుదుళ్లల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లు లేకుండా చేయడంలో దోహదపడతాయి. ఈ నూనెను మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు. కేవలం కొన్ని చుక్కల మోతాదులోనే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా పసుపు నూనె మన చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.