Baby Reflexology Points : పసికందులన్నాక ఏడవడం సహజం. ఆకలైనా, నొప్పి కలిగినా, భయమేసినా వారు ఏడుస్తారు. ఈ క్రమంలో అలా ఏడ్చే పసికందులను చూస్తే వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. దీంతో వారిని ఎత్తుకోవడం, లాలించడం, బుజ్జగించడం చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కొందరైతే ఏడుపు మానేస్తారు, కానీ కొందరు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు. కానీ మీకు తెలుసా..? అలా బాగా సేపు ఏడ్చే చిన్నారులను కేవలం 1 నిమిషంలోనే ఏడుపు మాన్పించవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అదే కాదు, వారికి కలిగే పలు అనారోగ్య సమస్యలను కూడా కింద సూచించిన టిప్స్‌తో దూరం చేయవచ్చు. అవేమిటంట..
శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల్లో కొంత సేపు ఒత్తిడిని కలగజేస్తూ అక్కడ సున్నితంగా మర్దనా చేయడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని విన్నాం కదా. అవును. దాన్నే రిఫ్లెక్సాలజీ అని, ఆక్యుప్రెషర్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పద్ధతిలోనే పైన చెప్పిన చిన్నారుల సమస్యలను సులభంగా నయం చేయవచ్చు కూడా. అదెలాగంటే..
కాలి బొటన వేలి చివరి భాగాలను కొంతసేపు సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో తల, దంతాల సమస్యలు పోతాయి. అయితే చిన్నారులకు పళ్లు వస్తున్న సమయంలో ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చిన్నారులు సైనస్ వంటి శ్వాస కోశ సమస్యలతో బాధపడుతుంటే కాలి బొటన వేళ్ల మధ్యలో సున్నితంగా కొంత సేపు మర్దనా చేయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి చిన్నారులకు ఉపశమనం కలుగుతుంది. పాదంపై ఒత్తిడిని కలగజేస్తూ ఆ ప్రాంతంలో కొంత సేపు మసాజ్ చేస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
కొందరు పిల్లలకు ఛాతి, కడుపు మధ్య భాగానికి నొప్పి వస్తుంటుంది. దీన్నే సోలార్ ప్లెక్సస్ అని పిలుస్తారు. అయితే దీన్ని తగ్గించాలంటే కాలి వేళ్ల పైభాగాల్లో మర్దనా చేయాలి. పాదంపై వంకరగా, ఆర్క్ రూపంలో ఉన్న ప్రాంతంలో మర్దనా చేస్తే పిల్లలకు జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. అదే ఆర్క్ కింది భాగంలో మర్దనా చేస్తే మలబద్దకం, గ్యాస్ తొలగిపోతుంది. కాలి మడమలపై మర్దనా చేస్తే కండరాల సమస్యలు పోతాయి. అంతేకాకుండా చక్కని శరీర ఆకృతి వస్తుంది. రెండు పాదాలకు కింది వైపు మధ్యభాగంలో మర్దనా చేస్తే పిల్లలు ఇట్టే ఏడుపును ఆపేస్తారు.