Rose Petals For Anemia : వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్టుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరుచూ స్పృహ కోల్పోవడం, తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి వివిధ రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తహీనత సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఒక్కోసారి ఈ సమస్య కారణంగా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. వైద్యులు రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ టాబ్లెట్స్ ను సూచిస్తూ ఉంటారు. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉంటారు. ఇలా ఐరన్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటూనే ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాను పాటించడం చాలా సులభం. ఈ చిట్కాను పాటించిన 15 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చే మార్పును గమనించవచ్చు. రక్తహీనతను తగ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే ఎర్ర గులాబీ రేకులు, ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి మరిగించాలి. గులాబి రేకులు ఎండినవి లేదా తాజావైనా వాడుకోవచ్చు.
ఈ నీటిని 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా తాగాలి. ఇలా రోజూ ఉదయం పూట తాగడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. చాలా త్వరగా, చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఇలా తయారు చేసుకున్న నీటిని రాత్రి సమయంలో తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. ఈ విధంగా చాలా సులభంగా ఈచిట్కాను పాటించడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.