Wheat Flour Burfi : గోధుమపిండితో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గోధుమపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోధుమపిండి బర్ఫీ కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ బర్ఫీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో రుచిగా, కమ్మటి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, బెల్లం తురుము – అర కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
గోధుమపిండి బర్ఫీ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత గోధుమపిండి వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత దీనిని కలుపుతూ రంగు మారే వరకు వేయించాలి. ఇలా చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు వేయించిన తరువాత ఇందులో యాలకుల పొడి, బెల్లం వేసి కలపాలి. దీనిని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి.బెల్లం కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్ లోకి లేదా బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. తరువాత అంతా సమానంగా అనుకుని పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. ఈ బర్ఫీ పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బర్ఫీ తయారవుతుంది. ఈ బర్ఫీ రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.