Curry Leaves For Eyes : నేటి తరుణంలో మనలో చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గడం వల్ల చిన్న వయసు నుండే కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. కంటి చూపు తగ్గడానికి వివిధ కారణాలు ఉంటాయి. కంప్యూటర్ లను, సెల్ ఫోన్ లను ఎక్కువగా చూడడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. అలాగే నిద్రలేమి కారణంగా కూడా కంటి చూపు తగ్గుతుంది. తక్కువగా నిద్రపోవడం వల్ల కంటిచూపు తీవ్రంగా దెబ్బతింటుంది. అలాగే పోషకాహార లోపం వల్ల కూడా కంటిచూపు దెబ్బతింటుంది. ఇలా అనేక రకాల కారణాల చేత కంటి చూపు దెబ్బతింటుంది.
ఇలా కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు సహజ సిద్ద ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో మనకు విటమిన్ ఎ ఎంతో దోహదపడుతుంది. మాంసాహారంలో విటమిన్ ఎ నేరుగా అదే రూపంలో ఉంటుంది. కానీ శాఖాహారాల్లో విటమిన్ ఎ కెరోటీన్ రూపంలో ఉంటుంది. దీనిని మన శరీరంలో ఉండేకాలేయం విటమిన్ ఎ రూపంలోకి మార్చుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒకటి. కనుక కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. క్యారెట్ జ్యూస్ ను నేరుగా తాగలేని వారు జ్యాస్ పట్టేటప్పుడు జార్ లో క్యారెట్ ముక్కలు, కీర దోస ముక్కలు, టమాట ముక్కలు, బీట్ రూట్ వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ జ్యూస్ ను వడకట్టి అందులో తేనె వేసి తీసుకోవాలి.
ఇలా రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇదే జ్యూస్ లో లేత కరివేపాకును మెత్తని పేస్ట్ లాగా చేసి కలిపి తీసుకోవచ్చు. ఇలా కరివేపాకును తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇందులో కరివేపాకుకు బదులుగా మునగాకు పేస్ట్ ను కూడా కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు మరియు మునగాకులో కూడా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇలా జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల కంటిచూపు ఎంతగానో మెరుగుపడుతుంది.
కళ్లద్దాలు వాడే అవసరం కూడా తగ్గుతుంది. అలాగే కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు మధ్యాహ్నం భోజనంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ లో అలాగే రోజూ తగినంత నిద్ర పోవడం కూడా చాలా అవసరం. నిద్రపోవడం వల్ల కంటిచూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.