Nutmeg : మనం వంట్లలో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాము. మనం వంట్లలో వాడే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. దీనిని ఎక్కువగా పొడిగా చేసి వేస్తూ ఉంటారు. నాన్ వెజ్ వంటకాల్లో, వివిధ రకాల స్మూతీల తయారీలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. జాజికాయను వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జాజికాయను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జాజికాయను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయను వాడడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. జాజికాయను వాడడం వల్ల దీనిలో ఉండే నూనెల కారణంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం పూట స్మూతీలల్లో లేదా ఓట్ మీల్ లో కొద్దిగా జాజికాయ పొడిని వేసుకోవడం వల్ల రోజంతా ఏకాగ్రతతో పని చేసుకోవచ్చు. అలాగే చిటికెడు జాజికాయ పొడిని గోరు వెచ్చని పాలల్లో వేసుకుని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా జాజికాయలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలతో బాధపడే వారు జాజికాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జాజికాయను వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. అలాగే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనిని వాడడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక జాజికాయను వాడడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా జాజికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.