Karbuja Sharbat : మనలో చాలా మందికి అప్పుడప్పుడూ చల్ల చల్లగా, రుచిగా డిసర్ట్స్ తినాలనిపిస్తుంది. ఇలా తినాలనిపించినప్పుడు చాలా మంది బయట నుండి తీసుకు వచ్చిన ఐస్ క్రీమ్స్ ను, కేక్స్, స్మూతీలను తింటూ ఉంటారు. వీటికి బదులుగా మనం ఇంట్లోనే చల్ల చల్లగా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కర్బూజ షర్బత్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ షర్బత్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ షర్బత్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ కర్బూజ షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్బూజ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన సేమియా – అర కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు – 3 టేబుల్ స్పూన్స్, కర్బూజ పండు – 1, పంచదార – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 6, వెనీలా ఐస్ క్రీమ్ – 3 స్కూబ్స్.
కర్బూజ షర్బత్ తయారీ విధానం..
ముందుగా కర్బూజ పండు లోపల ఉండే గింజలను జాలి గిన్నెలో వేసి స్పూన్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల గింజలకు ఉన్న గుజ్జు కూడా వస్తుంది. తరువాత కర్బూజ పండులో ఉండే గుజ్జును తీసి జార్ లో వేసుకోవాలి. తరువాత కర్బూజ షెల్ ను కూడా పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో పంచదార, ఔస్ క్యూబ్స్, ఐస్ క్రీమ్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉడికించని సేమియా, 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచిన కర్బూజ షెల్ లో సగానికి వేసుకోవాలి. తరువాత దీనిపై మరో 2 స్కూబ్స్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను, రోస్ సిరప్ ను వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కర్బూజ షర్బత్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.