Dhaba Style Aloo Matar Curry : మనకు ధాబాలల్లో లభించే వెజ్ కర్రీలల్లో ఆలూ మటర్ కర్రీ కూడా ఒకటి. బంగాళాదుంపలు, పచ్చిబఠానీ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, పూరీ,నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఆ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. బంగాళాదుంపలతో తరుచూ ఒకేరకమైన కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ మటర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ ఆలూ మటర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 3, పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెమ్మలు – 8, బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), బటర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ముప్పావు లీటర్, పచ్చిబఠాణీ – పావు కప్పు, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్.
ధాబా స్టైల్ ఆలూ మటర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో వేసి ఉంచుకోవాలి. తరువాత కళాయిలో బటర్, నూనె వేసి వేడి చేయాలి.తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కారం, శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత బఠాణీ, బంగాళాదుంప ముక్కలు వేసికలపాలి. తరువాత ఆమ్ చూర్ వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కలపాలి. తరువాత ఆమ్ చూర్ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని కూరలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మటర్ కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా సులభంగా ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ మటర్ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.