ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాలు కూడా మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోషకాలను అందిస్తూనే శరీరానికి అవి శక్తిని ఇస్తాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అలాంటి ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఒకటి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయ పడతాయి. ఈ క్రమంలోనే పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు
పొద్దు తిరుగుడు విత్తనాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
2. జీర్ణవ్యవస్థకు
జీర్ణ సమస్యలతో బాధపడే వారు నిత్యం పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిల్లో ఉండే ఎంజైమ్‌లు మలబద్దకం, ఐబీఎస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.
3. హార్మోన్ల సమస్యలకు
హార్మోన్ల సమస్యలు ఉన్నవారు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే మంచిది. దీని వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. అనేక పోషకాలు లభిస్తాయి.
4. వాపులు
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, ఇతర వృక్ష సంబంధ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది.
5. గుండె ఆరోగ్యానికి
పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. తరచూ పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.