Hibiscus Tea : మనం ఇంట్లో సులభంగా పెంచుకునే పూల మొక్కలల్లో మందార మొక్క కూడా ఒకటి. మందార పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటి పెరడుకే ఎంతో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మందార పూలు అందంగా ఉండడంతో పాటు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా జుట్టు పెరుగుదలలో వాడుతూ ఉంటారు. మందార పువ్వులతో నూనె, పేస్ట్ తయారు చేసి జుట్టుకు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగుతుంది. అయితే కేవలం జుట్టు పెరుగుదలలోనే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మందార పూలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
మందార పువ్వులతో టీని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ టీని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గ్లాస్ నీటిలో ఒక మందార పువ్వు, ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక గ్రాము శొంఠి పొడి, 3 గ్రాముల అర్జున( తెల్ల మద్ది) బెరడు పొడి వేసి మరిగించాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న టీని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా టీని తయారు చేసుకుని 12 వారాల పాటు తాగడం వల్ల శరీరంలో కఫ, పిత్త దోషాలు తొలగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అదే విధంగా అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మందార పువ్వులతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.