Lemon Juice With Turmeric And Black Pepper : మన వంటగదిలో ఉండే వాటిల్లో పసుపు ఒకటి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం మనం వంటల్లో వాడుతూనే ఉంటాము. అలాగే మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. మిరియాలను పొడిగా చేసి మనం వంటల్లో వాడుతూ ఉంటాము. మిరియాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనం పసుపును కానీ, మిరియాలను కానీ విడివిడిగా వాడుతూ ఉంటాము. వీటిని విడివిడిగా వాడడానికి బదులుగా నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు, మిరియాలు, నిమ్మరసం.. ఇవి మూడు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
పసుపు, నిమ్మరసం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, నిమ్మరసం, మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. జీర్ణశక్తిని పెంచడంలో కూడా ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. పసుపు, మిరియాలు, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
శరీరంలో మంటను తగ్గించడంలో, వాపును తగ్గించడంలో ఇవి మనకు దోహదపడతాయి. పసుపు, నిమ్మరసం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. అంతేకాకుండా పసుపు, నిమ్మరసం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించి శరీర బరువు తగ్గేలా చేయడంలో కూడా ఈ మూడు మనకు సహాయపడతాయి.
శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి మనం త్వరగా బరువు తగ్గేలా చేయడంలో ఇవి మనకు దోహదపడతాయి. అంతేకాకుండా పసుపు, నిమ్మరసం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ విధంగా పసుపు, నిమ్మరసం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చక్కటి ఆరోగ్యాన్ని పొందడంలో ఇవి మనకు ఎంతో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.