కొంత మంది మహిళలకు సహజంగానే బిడ్డను ప్రసవించాక పాలు సరిగ్గా పడవు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. శిశువుకు 3 ఏళ్ల వరకు అయినా సరే తల్లిపాలను తాగించాలి. దీంతో వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషణ లభిస్తుంది. అయితే పాలు బాగా పడని బాలింతలు కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే పాలు బాగా పడతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పాలు బాగా పడాలంటే బాలింతలు పాత బెల్లం , పాత అల్లం పచ్చడి తినాల్సి ఉంటుంది.
* నువ్వుల నూనెతో చేసిన వంటలు చాలా మంచి చేస్తాయి.
* మునగ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి బాలింతల్లో పాలు బాగా పడేలా చేస్తాయి. మునగ ఆకును పప్పులో వేసి వండుకుని తింటే పాలు బాగా పడతాయి.
* మునగకాయలు లేదా మునగకాయల పచ్చడిని కూడా తీసుకోవచ్చు.
* తెలగపిండి కూర, తెలగ పిండి వడియాలు చేసుకుని తినాలి.
* నువ్వులతో కారప్పొడి, కరివేపాకు పొడి చేసుకొని తినాలి.
* పచ్చి బొప్పాయిలను కూరగా చేసుకుని తింటే పాలు పడతాయి.
* నాన్ వెజ్ తినేవాళ్లు అయితే చేపలు, మటన్ తినాలి.
* పాలు, కోడిగుడ్లను తీసుకోవాలి. వీటి వల్ల కూడా బాలింతల్లో పాలు బాగా పడతాయి.