ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎంత అవసరమో మనకి తెలుసు. అయితే, రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా క్యాష్ ని ఉపయోగించడం తగ్గించేశారు. కానీ, ఇంకా అక్కడక్కడ తప్పకుండా క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటోంది. మనం ప్రస్తుతం పరిస్థితిని గమనించినట్లయితే.. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. అలాగే, 50 రూపాయల నోట్లు కూడా తగ్గిపోయాయి. కరెన్సీ నోట్లు చిరిగిపోవడం వలన కొన్ని నోట్లో అందుబాటులో లేక సర్కులేషన్ ఆగిపోయింది. పది రూపాయల కాయిన్లు, 20 రూపాయలు కాయిన్లని కూడా తీసుకువచ్చారు. కానీ, కొన్ని పరిస్థితుల కారణంగా అవి సర్కులేషన్ అవ్వకుండా ఆగిపోయాయి.
ఇప్పటికి కూడా ఆంధ్రలో చాలా చోట్ల కాయిన్స్ ని తీసుకోవట్లేదు. ఇవి చెల్లవని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేయడం వలన చాలామంది కాయిన్స్ ని తీసుకోవట్లేదు. మార్కెట్లోకి వచ్చిన కొంతకాలానికి ఇవి కనపడలేదు. చెల్లవని చెప్పేస్తున్నారు. ఐదు రూపాయల నోట్లు కూడా మార్కెట్ నుంచి కనుమరుగైపోయాయి. అయితే, బ్యాంకులు రూ.10 కాయిన్లని, 20 రూపాయల నోట్లను తీసుకోమని ఉపయోగించమని చెప్తున్నాయి.
నెమ్మదిగా ప్రజలు అర్థం చేసుకుని కాయిన్స్ ని మళ్ళీ తీసుకుంటున్నారు. అయితే, కాయిన్స్ ని పర్సులో పెట్టుకుని తీసుకెళ్లడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే కాగితాలు అయితే బరువు ఉండవు. పర్సులో ఎక్కువ కాయిన్స్ పెట్టుకోవడానికి కూడా అవ్వదు. అలాగని పాకెట్లో పెట్టుకున్నా కూడా బరువుగా ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి చిన్న బ్యాగు లాంటిది కాయిన్స్ పెట్టుకోవడానికి పట్టుకెళ్ళడం మంచిది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, 50 రూపాయల నోట్లు కూడా బ్యాంకుల్లో ఇప్పుడు అందుబాటులో ఉండట్లేదు.