ఈ ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? ఆమెకి సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే పోస్టులన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన వాక్చాతుర్యంతో అదరగొడుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఆమె ఎవరో గుర్తొచ్చిందా.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ క్రమంలో బుల్లితెరపై దూసుకుపోతున్న ఈ అందాల యాంకరమ్మ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎవరో గుర్తుపట్టేయండి. క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్. బుల్లితెరపై సత్తా తాటుతోన్న అందాల యాంకరమ్మ అనసూయ. ఓవైపు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది అనసూయ భరద్వాజ్. అనసూయ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.