దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా 86 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన సేవాతత్వంతో ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. రతన్ నావల్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో నావల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించారు. అతను జమ్‌సెట్‌జీ టాటాకి ముని మనవడు. టాటా గ్రూప్‌ని స్థాపించింది ఆయనే.టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్ల వ్యాపార విస్తరణలో రతన్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కూడా కొనుగోలు చేశాడు.2009లో రతన్ టాటా మధ్యతరగతి ప్రజల కోసం ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు నానోను విడుదల చేశారు. ఈ కారు ధర లక్ష రూపాయలు.
మాజీ చైర్మన్ రతన్ టాటా మరణం టాటా సామ్రాజ్యానికి అతిపెద్ద నష్టం కాగా, ఇప్పుడు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే కోట్ల ఆస్తులు ఉన్న రతన్ టాటా ఎప్పుడు సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడేవాడు. ఆయనకి కోలాబాలో రూ. 200 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు, ప్రైవేట్ జెట్, ఫెరారీ కాలిఫోర్నియా టీమరియు జాగ్వార్ ఎఫ్-టైప్‌తో సహా లగ్జరీ వాహనాలు ఉన్నా కూడా సాధారణ జీవితాన్ని గడిపారు. తాజాగా రతన్ టాటా పాత ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. క్వార్ట్జ్‌తో నడిచే విక్టోరినాక్స్ స్విస్ ఆర్మీ రీకాన్ వాచ్‌ని ధరించిన రతన్ టాటా పిక్ చర్చనీయాంశంగా మారింది.
బిలియనీర్లు విభిన్నంగా కనిపించే ఈ రోజుల్లో రతన్ చవకైన వాచీని ధరించాడు ఆయన గడియారం ప్రెస్-ఆన్-బ్యాక్ ప్లాస్టిక్ కేస్‌లో ఉంచబడింది. ఇందులో 3, 6 మరియు 9 సంఖ్యలు బోల్డ్‌లో వ్రాయబడి ఉండగా, ఈ వాచ్ ధర దాదాపు రూ.10,328. అంత బిలీయనర్ ఇంత తక్కువ ధర వాచ్ ధరించారా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా చదువుతున్నప్పుడు సంగీత విద్వాంసులు జుబిన్ మెహతా, వ్యాపారవేత్తలు అశోక్ బిర్లా, రాహుల్ బజాజ్, డ్యూక్ యజమాని దిన్‌షా పండోల్ వంటి చాలా మంది పెద్ద పెద్ద వారు కూడా రతన్ టాటాకి క్లాస్‌మేట్స్. అలాగే రతన్ టాటా బయటకు వెళ్లినప్పుడు సామాస్యులను కూడా పలకరించే మనస్సు. రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారులను సైతం పలకరించేవారట.