Simhadri Movie : ఎస్ ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ 2003 జులై 9న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పాత రికార్డులనుఈ మూవీ చెరిపేసింది. అయితే ఈ సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజయ్యాయి. పదిమంది క్షేమం కోసం తాను చావడానికైనా, చంపడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. కేరళలో సింగమలైగా గుర్తింపు పొందుతాడు. ఫ్లాష్ బ్యాక్ తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కీరవాణి సంగీతం అదిరిపోయింది. భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు.
కమెడియన్స్ గా వేణుమాధవ్, బ్రహ్మానందం బాగా నటించారు. ఈ మాస్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని నాలుగు రెట్లు పెంచింది. ఈ సినిమాకు 20 రోజుల ముందు రిలీజైన దొంగరాముడు అండ్ పార్టీ సినిమా పూర్తిగా డల్ అయింది. వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి చక్రి సంగీతం అందించాడు. అయితే సింహాద్రి వచ్చిన రెండు రోజులకే వెంకటేష్ నటించిన వసంతం మూవీ వచ్చింది. అయితే వసంతం మూవీకి సింహాద్రి ఎఫెక్ట్ తగల్లేదు. రెగ్యులర్ గానే ఈ మూవీతో విక్టరీ వెంకటేష్ విజయాన్ని అందుకున్నాడు. ఆర్తి అగర్వాల్, కళ్యాణి హీరోయిన్స్ గా నటించారు.
ఎస్ఏ రాజకుమార్ సంగీతం వసంతం సినిమాకు మంచి బలాన్నించింది. ప్రకాష్ రాజ్ తదితరుల నటన ఆకట్టుకుంటుంది. వసంతం మూవీ 157 సెంటర్స్ లో 50రోజులు, 57 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. సింహాద్రి వచ్చిన 9 రోజుల తర్వాత అంటే జూలై 18న వేణు నటించిన మూవీ కల్యాణ రాముడు సోలో హిట్ గా నిలిచింది. జి రామ్ ప్రసాద్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. మళయాళ మూవీకి రీమేక్ గా ఈ మూవీ తీశారు. వేణు మార్క్ కామెడీ, ప్రభుదేవా ఎంట్రీ, మణిశర్మ బాణీలు ఈ మూవీకి సైలెంట్ విజయాన్ని అందించాయి. సింహాద్రి, వసంతం మూవీస్ ని తట్టుకుని కల్యాణరాముడు కూడా విజయం అందుకుంది.