Money Earning : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని, మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే కష్టపడితే సరిపోదు. ఈ విషయాలని కూడా కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇలా పాటిస్తే మాత్రం కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. డబ్బు ఎప్పటికీ చేదుగా మారదు. డబ్బులు సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. డబ్బు ఉంటే, మనం మన అవసరాల్ని తీర్చుకోవచ్చు. అయితే అందరూ సరైన విధానంలో డబ్బుని ఖర్చు చేయరు.
అనవసరమైన ఖర్చుల్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. నిజానికి చాలామంది అప్పుల పాలైపోవడానికి కారణం డబ్బును సరిగ్గా ఉపయోగించకపోవడమే. అయితే డబ్బు విషయంలో, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా డబ్బు పై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది డబ్బులు సంపాదించే క్రమంలో, ఇతరులతో పోల్చుకుంటారు.
ఆ తప్పు ఎప్పుడూ చేయకండి. పైగా ఇలా కంపేర్ చేసుకునే క్రమంలో, వాళ్లని తక్కువ చేసుకుంటారు. అది అసలు మంచిది కాదు. అయితే జీవితంలో ఎదగాలి అనుకోవడం మంచిది. కానీ ఎదుటి వాళ్ళని చూసి అలా ఎదగాలి అనుకోవడం పొరపాటు. డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ డబ్బులు ఎక్కువగా వస్తాయి.
కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా మంచి పద్ధతి. ధనవంతులు అవ్వాలంటే, మనం డబ్బు ఖర్చు చేసే పద్దతి చాలా ముఖ్యం. మనం దేనికి ఖర్చు చేస్తున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నామో అనేది చూసుకోవాలి. మనం ఒకటికి, రెండు సార్లు ఉపయోగించే వస్తువుల కోసం వేలకి వేలు పెట్టి కొనడం మంచిది కాదు. దాని వలన అనవసరంగా డబ్బులు వృధా అవుతాయి. అవసరాలకు, ఇష్టానికి తేడా తెలుసుకుంటే, ఖర్చు చేయడం మీకు బాగా తెలుస్తుంది.