Bay leaf benefits : బిర్యానీ ఆకులు మంచి రుచిని ఇస్తాయి. చాలా మంది, బిర్యాని ఆకుల్ని అనేక రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. కేవలం బిర్యానీలో మాత్రమే వేసుకోవడానికి కాదు. దీని వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. బిర్యానీ ఆకుల్ని మనం ఆహార పదార్థాలలో వేస్తే, మంచి రుచి వాసన మాత్రమే కాదు. పలు రకాలు ప్రయోజనాలు కూడా ఉంటాయి. బిర్యానీ ఆకులలో ఉండే పోషకాల వలన మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మరి, ఇక ఎటువంటి పోషకాలని మనం బిర్యానీ ఆకులతో పొందవచ్చు..?, ఏఏ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటగా విటమిన్ బీ6 కూడా ఉంటుంది. ఐరన్, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. మెదడు మరింత బాగా పని చేస్తుంది. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.
జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి శ్వాస కోశ సమస్యలని తగ్గిస్తుంది. ఈ ఆకుల టీ ని తాగడం వలన చాలా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గర్భిణీలకు ఫాలిక్ యాసిడ్ చాలా అవసరం. ఈ ఆకులలో ఇది పుష్కలంగా ఉంటుంది. 10 గ్రాముల బిర్యానీ ఆకులలో 18 గ్రాముల ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. కనుక, గర్భిణీలు రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.
బిర్యానీ ఆకుల్ని తీసుకోవడం వలన ఉబకాయం, అధిక బరువు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇందులో కెఫిన్ ఆమ్లం తదితర పదార్థాల వలన రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైపర్ టెన్షన్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. గుండెపోటు వంటి ప్రమాదం కూడా ఉండదు. క్రమం తప్పకుండా బిర్యాని ఆకుల్ని తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ నుండి ఈజీగా బయటపడొచ్చు.