Aloo Chips : పిల్లలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంపలని తినడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలకైతే బంగాళదుంప ఫేవరెట్. బంగాళదుంప వేపుడు, బంగాళదుంప చిప్స్ అంటే పిల్లలు అస్సలు అడ్డు చెప్పరు. పైగా పిల్లలు మొండి చేసి మరీ బంగాళదుంప వేపుడు, చిప్స్ వంటివి చేయించుకుని తింటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం బంగాళదుంపల చిప్స్ ని అదే పనిగా తింటూ ఉంటారు. అయితే బంగాళదుంప చిప్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అయితే తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరి బంగాళదుంప చిప్స్ తీసుకుంటే ఏమవుతుంది..? ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి.. అనేది చూద్దాం. బంగాళదుంప చిప్స్ పలుచగా ఉంటాయి. తేలికగా ఉంటాయి. అయితే ఎక్కువగా తీసుకున్నా ఏం అవ్వదని చాలామంది భావించి అదేపనిగా తింటూ ఉంటారు. కానీ పొటాటో చిప్స్ ని ఎక్కువగా తినడం వలన అందులో ఉప్పు, నూనె ఎక్కువ ఉంటాయి. ఇవి బీపీని పెంచుతాయి. రక్త పోటు స్థాయిలు పెరిగితే పలు రకాల సమస్యలు కలుగుతుంటాయి. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉంటుంది.
అధిక రక్తపోటుకి బంగాళదుంప చిప్స్ దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఇది మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలో సోడియం లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. కాబట్టి లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. పొటాటో చిప్స్ ని ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంటుంది. క్యాన్సర్ బారిన పడి అనవసరంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాలి. గుండె ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది.
బంగాళదుంప చిప్స్ ని తీసుకోవడం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ బాగా పెరిగినట్లు స్టడీ చెప్తోంది. బంగాళదుంప చిప్స్ ఎక్కువ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ బంగాళాదుంపల చిప్స్ ని తీసుకోవడం వలన బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
స్టడీ ద్వారా ట్రాన్స్ ఫ్యాట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా ప్రశాంతంగా కూడా ఉండలేరట. ఇలా బంగాళదుంప చిప్స్ వలన ఇన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.