Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

టైట్ జీన్స్ ధరిస్తున్నారా… మీ ఆరోగ్యం మీరే పణంగా పెడ్తున్నారు…

Admin by Admin
April 18, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీయువకుల‌ అభిరుచి కూడా మారుతుంది.. వారి ఇష్టాలకు తగినట్టుగానే రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అమ్మాయిలకైతే బోలెడన్నీ మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఇలా చాలా రకాలున్నాయి.. కానీ ఇలాంటి టైట్ దుస్తులను ధరించడం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు… చాలామంది లావుగా ఉన్నవాళ్లు వారి పిరుదులు, తొడల భాగంలో ఉన్న అనవసర ఫ్యాట్ ని కనిపించకుండా చేయడం కోసం ఇలాంటి టైట్ జీన్స్ వేసుకుంటారు. కానీ దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఫ్యాషన్ ప్రపంచంలో మిమ్మల్ని అందంగా చూపినప్పటికీ మన కండరాల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. .స్కిన్‌ టైట్‌ జీన్స్‌ వల్ల కాళ్లకు రక్తసరఫరా నిలిచిపోయి..తద్వారా కండరాలు, నరాలు చచ్చుబడిపోతాయి.

కండరాలకు రక్తసరఫరా సరిగా లేకపోతే దీర్ఘకాలంలో, క్రియేటిన్ కైనేజ్ ఎంజైము అసాధారణ గరిష్ట స్థాయిల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది. మనం వేసుకునే దుస్తులు మన బాడీ షేప్ ను మౌల్డ్ చేస్తాయి..టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల కొవ్వును అనిచి పెట్టి ఉంచినప్పుడు మన శరీరాకృతి బాగున్నప్పటికీ ,తర్వాతర్వాత నొక్కి పెట్టి ఉంచబడిన అనవసర ఫ్యాట్ మన శరీరానికి ఒక ఆకృతి లేకుండా చేస్తాయి. కేవలం అమ్మాయిలకే కాదు టైట్ జీన్స్ వల్ల అబ్బాయిలకు కూడా పెద్ద నష్టం వాటిల్లుతుంది. వృషణాలు దెబ్బతిని న‌పుంస‌క‌త్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్త సరఫరా సరిగా లేక కండరాల్ని దెబ్బతీసే దీన్ని కంపార్ట్ మెంటల్ సిండ్రోమ్ గా డాక్టర్లు పేర్కొన్నారు.

skin tight jeans and their negative side effects

35 ఏళ్ల మహిళ ఒకరు స్కిన్ టైట్ జీన్స్ ధరించి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ చాలా సేపు నేలపై కూర్చుంది. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కాళ్లలో నిస్సత్తువ ఆవహించింది. దీంతో ఆమె అడుగు తీసి అడుగు వేయలేక, కాళ్ళపై నిలబడలేక అక్కడే కుప్పకూలిపోయింది. మళ్లీ పైకి లేచి నిలబడలేని దుస్థితి ఏర్పడింది. కాళ్ళకు రక్తం సరఫరా నిలిచిపోవడం వల్లే ఇలా జరిగినట్టు నిర్ధారించారు డాక్టర్లు .కాళ్లు విపరీతంగా వాచిపోయి.. ప్యాంటును తీసే పరిస్థితి కూడా లేక ప్యాంటును నర్సులు కత్తిరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మన శరీరం మనకు దొరికిన బహుమతి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్వీకరించాలి..అలాకాకుండా మార్పు కోరుకుంటే దానివల్ల మిగిలేది బాధ తప్ప ఏం లేదు.. కాబట్టి మన శరీరాన్ని ప్రేమిద్దాం… ఎదుటివాళ్లకు అందంగా కనపడడం కోసం మన శరీరాన్ని కష్టపెట్టకుండా చూస్కుందాం…

Tags: skin tight jeans
Previous Post

పండ్ల రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా.? ఈ సులువైన పద్దతులను ప్రయత్నించండి..!!

Next Post

క్యాబ్ డ్రైవ‌ర్ నేర్పిన చెత్త బండి సూత్రం.. అంద‌రూ ఇది పాటిస్తే చాలు..

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.