Soft Chapati Recipe : చాలామంది, ఈ మధ్యకాలంలో అన్నం మానేసి చపాతీలను తింటున్నారు. కొంతమంది, బ్రేక్ ఫాస్ట్ కింద చపాతీలని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే. చపాతీలు చేయాలంటే కొంచెం కొన్ని టెక్నిక్స్ ని పాటించాలి. చపాతీలను ఎలా పడితే అలా చేశారంటే, అప్పడాల కింద వచ్చేస్తూ ఉంటాయి. తినడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. చపాతీలు పొరలు పొరలుగా, మెత్తగా రావాలంటే, ఇలా చేయండి. ఇలా చేశారంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ చపాతీలను ఇష్టంగా తింటారు, పైగా మృదువుగా వస్తాయి.
కాబట్టి, తినడానికి కూడా కష్టంగా ఉండదు. సాఫ్ట్ గా పొరలు పొరలుగా రావాలంటే, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. పైగా ఈ ప్రాసెస్ చాలా ఈజీ కూడా. పిండి కలుపుకునేటప్పుడు, కచ్చితంగా ఈ టెక్నిక్ ని పాటించాలి. పిండి కలుపుకునే పద్ధతి బాగుంటేనే చపాతీలు బాగా వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని, అందులో గోధుమపిండి వేసుకోండి. రెండు కప్పుల వరకు గోధుమపిండి వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి.
ఫ్రెష్ గా ఉన్న పెరుగును వేసుకుంటే, రుచి బాగుంటుంది అని గుర్తు పెట్టుకోండి. కావాలనుకుంటే, రుచి కోసం సాల్ట్ వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. పెరుగు మొత్తం పిండిలో కలిసేంత వరకు, బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి నీళ్లు పోసి పిండిని కలుపుకోకుండా, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని గట్టిగా కలుపుకుంటూ, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్లో గా కలుపుకోవడం వలన ఎక్కువ నీళ్లు పట్టి, బాగా మృదువుగా చపాతీలు వస్తాయి. పిండి ని రెండు భాగాలకు కింద చేసుకుని, ఒక భాగాన్ని అలా వదిలేసి, ఇంకో భాగాన్ని తీసుకోవాలి.
ఈ భాగం మొత్తం మీద, కొంచెం పొడి పిండి వేసుకుని మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ఫోల్డ్ చేసి, పొడి పిండి వేసుకుని. అలానే మళ్లీ ఫోల్డ్ చేసుకుని మొత్తం చపాతీ అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. తరువాత ఈ పెద్ద చపాతీని ముక్కలు కింద కట్ చేసుకోండి. ముక్కలు అన్నిటిని పక్కన పెట్టుకొని, ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చపాతీ కింద మళ్ళీ ఒత్తుకోవాలి. పొడి పిండి వేసుకుంటూ ఒత్తుకోండి. ఇలా చేయడం వలన ఈజీగా చపాతీలు లేయర్లు వస్తాయి. పైగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చపాతీలు గుండ్రంగా రావు స్క్వేర్ ఆకారంలో వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి చపాతీలను రెండు వైపులా తిప్పుతూ కొట్టుకొంది. లేయర్లు కింద చపాతీలు వస్తాయి. పైగా సాఫ్ట్ గా ఉంటాయి. ఇందాక పెట్టిన ముద్దని కూడా, అదే విధంగా మీరు రోల్ చేసుకుని కాల్చుకోండి.