Unwanted Hair : ప్రస్తుత తరుణంలో చాలా మంది అమ్మాయిలు, మహిళలు అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారు. పెదవులపై మీసాల్లాగా కొందరికి అవాంఛిత రోమాలు వస్తుంటాయి. అలాగే శరీరంపై పలు ఇతర ప్రదేశాల్లోనూ అవాంఛిత రోమాలు వస్తుంటాయి. దీంతో నలుగురిలో తిరగలేక ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో క్రీములు గట్రా కూడా ట్రై చేసి ఉంటారు. కానీ ఎలాంటి ఫలితం లభించక తీవ్ర అవస్థలు పడుతుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఓ అద్భుతమైన చిట్కాను పాటించవచ్చు. దీంతో అవాంఛిత రోమాలు వెంటనే పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ఇక ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో మీరు రెగ్యులర్‌గా వాడే ఏదైనా తెల్లని టూత్ పేస్ట్‌ను కాస్త వేయాలి. తరువాత అందులోనే పావు టీస్పూన్ బేకిగ్ సోడాను వేసి కలపాలి. అనంతరం అందులో కాస్త గోరు వెచ్చని నీటిని పోసి బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీంతో మిశ్రమం రెడీ అవుతుంది. ఏదైనా కాటన్ బాల్ లేదా శుభ్రమైన బ్రష్, క్లాత్‌తో ఆ మిశ్రమాన్ని కాస్త తీసుకుని మీకు శరరీంలో ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో.. అక్కడ దీన్ని అప్లై చేయాలి. తరువాత 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అనంతరం 15 నిమిషాల పాటు ఆగి తరువాత నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో వారం రోజుల్లోనే తప్పక ఫలితం కనిపిస్తుంది.
ఇక అవాంఛిత రోమాలను తొలగించడంలో పుదీనా రసం కూడా పనిచేస్తుంది. సాధారణంగా మహిళల్లో అవాంఛిత రోమాలు టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఏర్పడుతుంటాయి. అయితే రోజూ 2 టీస్పూన్ల పుదీనా ఆకుల రసం తాగితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అయితే పైన తెలిపిన చిట్కాతో కేవలం అవాంఛిత రోమాలనే కాకుండా కింద ఉండే రోమాలను కూడా తొలగించుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఈ చిట్కా పనిచేస్తుంది.