Healthy Drinks For Sleep : కొంతమందికి, రాత్రిపూట అసలు నిద్ర పట్టదు. రాత్రిపూట మంచి నిద్ర ని పొందాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన రాత్రి పూట బాగా నిద్రపోవచ్చు. రాత్రిపూట నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే, అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. రాత్రిళ్ళు, నిద్ర బాగా పట్టాలంటే, వీటిని తీసుకోండి. అప్పుడు మంచి నిద్ర ని పొందవచ్చు. రాత్రిపూట చమోమిలే టీ తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. జలుబు, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు తొలగిపోతాయి.
ఈ టీ ని తీసుకోవడం వలన అజీతి సమస్యలు కూడా దూరం అవుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ టీ ని తీసుకుంటే, మంచి నిద్రని పొందవచ్చు కూడా. మంచి నిద్ర ని పొందడానికి, అశ్వగంధ టీ కూడా తీసుకోవచ్చు. అశ్వగంధ టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ టీ ని రాత్రిపూట తీసుకుంటే, మంచి నిద్రని పొందవచ్చు.
రాత్రిపూట నిద్రపోవడానికి ముందు, గోరువెచ్చని పాలు తీసుకుంటే కూడా మంచి నిద్రని పొందడానికి అవుతుంది. మంచి నిద్ర ని పొందాలని అనుకుంటే, పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని రాత్రి తీసుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా మనం పసుపు పాలతో పెంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాత్రిపూట మంచి నిద్ర ని పొందడానికి, బాదం పాలు తీసుకుంటే కూడా మంచిది, వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, ఫైబర్ తో పాటుగా నిద్రని కలిగించే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోయినట్లయితే బాదం పాలు కూడా తీసుకోవడం మంచిది.