Prabhas Lamborghini Car : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ తన రేంజ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఖరీదైన కార్లు, విలువైన వస్తువులు వాడుతూ వార్తలలో నిలుస్తున్నాడు. ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా చిక్కాడు ప్రభాస్. ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్లడం వైరల్‌గా మారింది.. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియోని షేర్ చేసి.. మేము ప్రేమ గురించి ప్రార్థించం, కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని వీడియాకి కామెంట్‌గా పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తునే , మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు.
ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని కారు వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ఎన్టీఆర్ కూడా ఇదే కారుని కొనుగోలు చేశాడు. అయితే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్ 2, కల్కి 2తో పాటు రాజా సాబ్ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.